తౌషిక్ మృతిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలి
ABN , Publish Date - Oct 13 , 2026 | 05:08 AM
ప్రకాశం జిల్లా శింగరాయకొండలోని శ్రీచైతన్య నవోదయ కోచింగ్ సెంటర్‌లో విద్యార్థి తౌషిక్ మృతిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని, ఆయన తల్లి మౌలాబిని ఆత్మహత్యకు ప్రేరేపించిన వారిని అరెస్టు చేయాలని..
మౌలాబి ఆత్మహత్యకు కారకులను అరెస్ట్ చేయాలి
ఒంగోలు మహాధర్నాలో మంద కృష్ణమాదిగ డిమాండ్
ఒంగోలు కార్పొరేషన్, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లా శింగరాయకొండలోని శ్రీచైతన్య నవోదయ కోచింగ్ సెంటర్‌లో విద్యార్థి తౌషిక్ మృతిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని, ఆయన తల్లి మౌలాబిని ఆత్మహత్యకు ప్రేరేపించిన వారిని అరెస్టు చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. సోమవారం ఒంగోలులోని కలెక్టరేట్ వద్ద నిర్వహించిన మహాధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థి మృతి, ఆయన తల్లి ఆత్మహత్య కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు. ఇప్పటికైనా తౌషిక్ మృతిపై సీబీఐ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని, అలాగే విద్యార్థి తల్లి మౌలాబి ఆత్మహత్యకు కారకులైన వారిని తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నిందితులను72 గంటల్లో అరెస్టు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు సిద్ధం కావాల్సి ఉంటుందని మంద కృష్ణ హెచ్చరించారు.
పోలీసుల నిర్బంధం.. ఉద్రిక్తత
మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో చేపట్టిన మహాధర్నా ఉద్రిక్త పరిస్థితుల మద్య సాగింది. పోలీసులు ధర్నాకు అనుమతి ఇవ్వలేదు. వివిధ ప్రాంతాల నుంచి ఒంగోలు వచ్చే వారిని అదుపులోకి తీసుకొని స్టేషన్లకు తరలించారు. రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్‌లలో పికెట్‌లుఏర్పాటు చేసి ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఈ వార్తలనూ చదవండి: