భావితరాలకు సనాతన ధర్మాన్ని తెలియజేయాలి
ABN , Publish Date - Oct 18 , 2026 | 04:23 AM
మన సనాతన ధర్మాన్ని భవిష్యత్తు తరాలకు తెలియజెప్పాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ పిలుపునిచ్చారు.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ పిలుపు
విజయవాడ ఉత్సవ్ మన సంస్కృతిని తెలియజేస్తోందని ప్రశంస
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌లతో భేటీ
దుర్గమ్మ దర్శనం.. సీఆర్డీఏ కార్యాలయ సందర్శన
అమరావతి, విజయవాడ, తుళ్లూరు, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): మన సనాతన ధర్మాన్ని భవిష్యత్తు తరాలకు తెలియజెప్పాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ పిలుపునిచ్చారు. పవిత్రమైన దేవీ నవరాత్రుల ఉత్సవాల్లో మన సంస్కృతి, సాంప్రదాయాలు తెలియజెప్పేలా కళా ప్రదర్శనలు ఇవ్వడం అభినందనీయమన్నారు. విజయవాడ పున్నమి ఘాట్‌లో నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్‌కు శనివారం ఆయన హాజరయ్యారు. వేదికపై అద్భుత ప్రదర్శన ఇచ్చిన స్వరూప్, ఆరాధ్య దివ్యశ్రీ, కె.దియాశ్రీలకు ఆయన టైటిల్స్ అందజేసి అభినందించారు. అంతకుముందు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు.
గన్నవరంలోని విమానాశ్రయంలో ఆయనకు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. రాయపూడిలోని ఏపీ సీఆర్డీఏ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి అమరావతి విజన్, అభివృద్ధి పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. అంతకుముందు సీఎం నివాసానికి వచ్చిన మోహన్ యాదవ్‌కు మంత్రి లోకేశ్ స్వాగతం పలికారు. యువగళం పాదయాత్ర పుస్తకాన్ని అందజేశారు.
పులులను సంరక్షిద్దాం..
నాగార్జుసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలోని పులుల సంరక్షణ చర్యలను మరింత బలోపేతం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను మోహన్ యాదవ్ కోరారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పవన్ కల్యాణ్‌తో ఆయన మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆయనను ఉప్పాడ పట్టు శాలువాతో పవన్ సత్కరించారు.
ఈ వార్తలనూ చదవండి:
జగన్ ఆదేశాల మేరకే పులివెందులలో వైసీపీ అరాచకం: టీడీపీ నేతలు
దసరా స్పెషల్ ట్రైన్లు.. ఛార్జీల పెంపుపై దక్షిణ మధ్య రైల్వే క్లారిటీ