Share News

భార్యను లాడ్జికి తీసుకెళ్లి హత్య

ABN , Publish Date - Oct 16 , 2026 | 05:28 AM

వివాహేతర సంబంధం పెట్టుకుందన్న కోపంతో భార్యను లాడ్జికి తీసుకెళ్లి గొంతుకోసి హత్య చేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున అన్నమయ్య జిల్లా మదనపల్లెలో చోటు చేసుకుంది. వన్‌టౌన్‌ పోలీసుల కథనం మేరకు..

 భార్యను లాడ్జికి తీసుకెళ్లి హత్య

  • బీరుబాటిల్‌ ముక్కతో గొంతుకోసిన వైనం

  • ప్రియుడిని వదిలేది లేదని చెప్పడంతో ఘాతుకం

  • పోలీసులకు లొంగిపోయిన భర్త.. మదనపల్లెలో ఘటన

మదనపల్లె క్రైం, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): వివాహేతర సంబంధం పెట్టుకుందన్న కోపంతో భార్యను లాడ్జికి తీసుకెళ్లి గొంతుకోసి హత్య చేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున అన్నమయ్య జిల్లా మదనపల్లెలో చోటు చేసుకుంది. వన్‌టౌన్‌ పోలీసుల కథనం మేరకు.. కర్ణాటక రాష్ట్రం కోలారు జిల్లా ముళబాగల్‌ పట్టణానికి చెందిన షేక్‌. నవీద్‌బాషాకు 13ఏళ్ల కిందట అదే ప్రాంతానికి చెందిన రూబియాతాజ్‌(29)తో వివాహమైంది. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. నవీద్‌బాషా టూవీలర్‌ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. రూబియాతాజ్‌ ముళబాగల్‌కు చెందిన ఓ వ్యక్తితో సంబంధం పెట్టుకుందని తెలిసి దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.

భర్తపై అలిగిన ఆమె 7నెలల కిందట పిల్లలను అత్తారింట్లో విడిచిపెట్టి చిత్తూరు జిల్లా పలమనేరులో ఉన్న సోదరుడి ఇంటికి వెళ్లిపోయింది. నవీద్‌ పలుమార్లు కోరినా ఆమె కాపురానికి రాలేదు. బుధవారం పలమనేరుకు వెళ్లి ఆమెకు నచ్చజెప్పి ఇద్దరూ కలసి చిత్తూరులో షాపింగ్‌ చేసుకుని మదనపల్లెకు వచ్చారు. రాత్రి 8గంటల సమయంలో లాడ్జిలో పెంట్‌హౌ్‌సను అద్దెకు తీసుకున్నారు. ఇద్దరూ కలసి మద్యం తాగినట్లు పోలీసులు చెబుతున్నారు. వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని వదిలేయమని భర్త అనడంతో ఆమె ససేమిరా అంది. ‘నిన్నయినా వదిలేస్తా కానీ ప్రియుడిని మాత్రం వదిలిపెట్టను’ అని రూబియా తేల్చి చెప్పడంతో నవీద్‌ ఆగ్రహంతో బీరుబాటిల్‌తో ఆమె తలపై గట్టిగా బాదాడు. తర్వాత పగిలిన బీరుబాటిల్‌ ముక్కతో భార్య గొంతు కోసి హత్య చేశాడు. తెల్లవారుజామున అక్కడి నుంచి వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయం చెప్పి లొంగిపోయాడు.

ఈ వార్తలనూ చదవండి:

మీ ఛాయిస్‌ ఎవరు?

మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేయడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

Updated Date - Oct 16 , 2026 | 05:28 AM