ప్రియుడే హంతకుడు
ABN , Publish Date - Sep 18 , 2026 | 06:10 AM
వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను ఆమె ప్రియుడే హత్య చేశాడు. ఈనెల 15న నమోదైన అనుమానాస్పద మృతి కేసును రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీసులు 48గంటల్లోనే ఛేదించి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.
మెడకు తాడు బిగించి మహిళ హత్య
అనుమానాస్పద మృతి కేసును ఛేదించిన ఆదిభట్ల పోలీసులు
ఆదిభట్ల, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను ఆమె ప్రియుడే హత్య చేశాడు. ఈనెల 15న నమోదైన అనుమానాస్పద మృతి కేసును రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీసులు 48గంటల్లోనే ఛేదించి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం మేరకు... ప్రకాశం జిల్లాకు చెందిన కందికళ్ల కల్యాణి (38)కి, విశాఖపట్నానికి చెందిన దాసరి నరసింహమూర్తితో పదేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. కానీ పెద్దలు ఇద్దరికీ సర్దిచెప్పడంతో తిరిగి భర్త వద్దకు వెళ్లిన కల్యాణి.. తర్వాత అతడితో విడిపోయి ప్రియుడితో కలిసి ఈఏడాది ఫిబ్రవరి 12 నుంచి బాలాపూర్ మండలం నాదర్గుల్ సమీపంలోని శ్రీపురం కాలనీలో ఓ భవనంలో ఉంటోంది. ఈ నెల 15న ఇద్దరు గొడవ పడ్డారు.
మద్యం మత్తులో ఉన్న నర్సింహమూర్తి ఆగ్రహానికి గురై కల్యాణి మెడకు నైలాన్ తాడును బిగించి హత్య చేశాడు. అనంతరం దానిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు కల్యాణి ఫోన్ నుంచి ఆమె కుటుంబసభ్యులకు ఫొటోలు, లోకేషన్‌ను పంపించి, అక్కడి నుంచి పరారయ్యాడు. కుటుంబసభ్యులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్న ఆదిభట్ల పోలీసులు.. అనుమానస్పద మృతిగా గుర్తించారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుడు నర్సింహమూర్తిని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో నిందితుడు నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. కాగా, మహిళ హత్యకేసును చాకచక్యంగా ఛేదించిన పోలీసు సిబ్బందిని డీసీపీ రాజేశ్, ఏసీపీ ప్రదీ్‌పకుమార్‌రెడ్డి అభినందించారు.
ఈ వార్తలనూ చదవండి: