నేడు 517 మద్యం షాపులకు లాటరీ
ABN , Publish Date - Oct 08 , 2026 | 05:45 AM
రెన్యువల్ కాని మద్యం షాపులకు గురువారం లాటరీ నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ కమిషనర్ సీహెచ్ శ్రీధర్ తెలిపారు. పాత పాలసీ గడువు సెప్టెంబరుతో ముగిసిందని,
అమరావతి, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): రెన్యువల్ కాని మద్యం షాపులకు గురువారం లాటరీ నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ కమిషనర్ సీహెచ్ శ్రీధర్ తెలిపారు. పాత పాలసీ గడువు సెప్టెంబరుతో ముగిసిందని, కొత్త పాలసీలోకి రెన్యువల్ అయ్యేందుక అవకాశం ఇవ్వగా.. 2,929 షాపుల లైసెన్సీలు రెన్యువల్ చేసుకున్నారన్నారు. మిగిలిన 807 షాపులకు లాటరీ పద్ధతిలో లైసెన్స్‌లు కేటాయించేందుకు నోటిఫికేషన్ జారీచేయగా.. 517 షాపులకు నాలుగు, అంతకంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. వాటికి గురువారం లాటరీ నిర్వహిస్తామన్నారు. దీంతో మొత్తం 3,446 షాపులు పనిచేస్తాయని, ఇది మొత్తం షాపుల్లో 92 శాతం అని పేర్కొన్నారు. మిగిలిన 290 షాపులకు త్వరలో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి..