హంస వాహనంపై లీలా మోహనుడు
ABN , Publish Date - Oct 14 , 2026 | 05:13 AM
తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన మంగళవారం రాత్రి హంస వాహనంపై సరస్వతి అలంకారంలో మలయప్ప దర్శనమిచ్చారు.
తిరుమల, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన మంగళవారం రాత్రి హంస వాహనంపై సరస్వతి అలంకారంలో మలయప్ప దర్శనమిచ్చారు. వీణధారిగా జ్ఞానప్రదాతగా లీలా మోహనరూపంలో ఆయనను భక్తులు దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారు ఐదు తలల చిన్న శేష వాహనంపై ద్వారకా కృష్ణుడి అవతారంలో దర్శనమిచ్చారు. మాడవీధుల్లో ముందు గజాలు, అశ్వాలు నడుస్తుండగా, భజన బృందాల ప్రదర్శనలు, మంగళ వాయిద్యాలు, వేదమంత్రాలు, జీయర్ల గోష్టి నడుమ సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చారు. బుధవారం ఉదయం సింహవాహనంపై, రాత్రి ముత్యపు పందిరి వాహనంపై దర్శనమివ్వనున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
గిన్నిస్ బుక్లోకి 75 గంటల డప్పుమోత