సింహ, ముత్యపుపందిరి వాహనాలపై మలయప్ప
ABN , Publish Date - Oct 15 , 2026 | 05:20 AM
తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారు బుధవారం సింహ,ముత్యపుపందిరి వాహనాలపై భక్తులను కటాక్షించారు. ఉదయం యోగనరసింహస్వామి అలంకారంలో
తిరుమల,అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారు బుధవారం సింహ,ముత్యపుపందిరి వాహనాలపై భక్తులను కటాక్షించారు. ఉదయం యోగనరసింహస్వామి అలంకారంలో వజ్రవైడూర్యాలతో అలంకారశోభితుడై, పట్టుపీతాంబరాలు ధరించి రెండు గంటలపాటు మాడవీధుల్లో విహరించారు. రాత్రి ముత్యపుపందిరి వాహనంలో సీతా స్వయంవరం అలంకారంలో శ్రీదేవి,భూదేవి సమేతుడై మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. గురువారం ఉదయం కల్పవృక్ష, రాత్రి సర్వభూపాలవాహన సేవలు జరగనున్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ ఎక్స్టెన్షన్ రద్దు.. అమెరికా ప్రభుత్వం వెల్లడి
హోర్ముజ్ జలసంధిలో మైన్ను ఢీకొని కార్గో నౌక మునక..