Share News

కారుమూరికి 25 వరకు రిమాండ్‌

ABN , Publish Date - Sep 18 , 2026 | 06:22 AM

మద్యం రవాణా టెండర్ల అక్రమాల కేసులో వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు ఏసీబీ కోర్టు ఈ నెల 25వ తేదీ వరకు రిమాండ్‌ విధించింది.

కారుమూరికి 25 వరకు రిమాండ్‌

విజయవాడ, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): మద్యం రవాణా టెండర్ల అక్రమాల కేసులో వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు ఏసీబీ కోర్టు ఈ నెల 25వ తేదీ వరకు రిమాండ్‌ విధించింది. ఈడీ అరెస్టు చేసిన కేసులో హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైల్లో ఉన్న ఆయనను సిట్‌ అధికారులు గురువారం విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్‌ విధించే క్రమంలో తనకు చంచల్‌గూడ జైలును కేటాయించాలని న్యాయాధికారిని ఆయన అభ్యర్థించారు. దీంతో ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించాలని న్యాయాధికారి ఎల్‌.తేజోవతి ఆదేశించారు.

ఈ వార్తలనూ చదవండి:

భలే మంచి బేరం !

బీజేపీది ద్వంద్వ వైఖరి: బొత్స

Updated Date - Sep 18 , 2026 | 06:22 AM