అలిపిరి నడక మార్గంలో చెట్టెక్కిన చిరుత
ABN , Publish Date - Sep 23 , 2026 | 05:03 AM
అలిపిరి నుంచి తిరుమలకు చేరుకునే నడక మార్గంలో చిరుత సంచారం హడలెత్తించింది. కొద్దిరోజులుగా ఏడో మైలు నుంచి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం మధ్య ప్రాంతంలో చిరుత కదలికలున్న విషయం తెలిసిందే.
అలిపిరి నుంచి తిరుమలకు చేరుకునే నడక మార్గంలో చిరుత సంచారం హడలెత్తించింది. కొద్దిరోజులుగా ఏడో మైలు నుంచి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం మధ్య ప్రాంతంలో చిరుత కదలికలున్న విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం 2,754వ మెట్టు సమీపంలోని అడవిలో ఓ చెట్టుపైకి ఎక్కి చిరుత హల్‌చల్ చేసింది. చిరుతను చూసిన భక్తులు హడలిపోయారు. భద్రతా సిబ్బంది సమాచారం ఇవ్వడంతో అటవీశాఖ సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకుని చిరుత అడవిలోకి వెళ్లిపోయేలా శబ్దాలు చేశారు. కొంత సమయం తర్వాత అది అడవిలోకి వెళ్లిపోయింది. చిరుత సంచారం నేపథ్యంలో భద్రతా సిబ్బంది ఆధ్వర్యంలో భక్తులను గుంపులుగా తిరుమలకు పంపుతున్నారు.
ఈ వార్తలనూ చదవండి...
పాదగయలో విషాదం.. పుష్కరిణిలో స్నానానికి దిగి యువకుడి గల్లంతు..
సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం