Share News

గూగుల్‌కు భూముల రిజిస్ట్రేషన్‌ పూర్తి

ABN , Publish Date - Sep 27 , 2026 | 05:15 AM

ఉమ్మడి విశాఖలో గూగుల్‌ ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్ల నిర్మాణానికి ఒక్కో అడుగు వేగంగా పడుతోంది.

గూగుల్‌కు భూముల రిజిస్ట్రేషన్‌ పూర్తి

  • ఉమ్మడి విశాఖ జిల్లాలో రెండు కంపెనీల పేరున 425 ఎకరాలు

విశాఖపట్నం, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి విశాఖలో గూగుల్‌ ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్ల నిర్మాణానికి ఒక్కో అడుగు వేగంగా పడుతోంది. ఆ సంస్థకు ప్రభుత్వం కేటాయించిన భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ విశాఖపట్నం జిల్లా మధురవాడ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో శనివారం పూర్తయింది. ఆనందపురం మండలం తర్లువాడలో 266.69 ఎకరాలను వైజాగ్‌ మెగా డేటా సెంటర్‌ పార్క్‌ లిమిటెడ్‌ పేరున, అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో కేటాయించిన 159.24 ఎకరాలను వైజాగ్‌ రాంబిల్లి డేటా సెంటర్‌ పార్క్‌ పేరున సేల్‌ డీడ్‌ చేసినట్టు మధురవాడ సబ్‌ రిజిస్ట్రార్‌ చక్రపాణి తెలిపారు. ఈ రెండు డేటా సెంటర్ల సామర్థ్యం వెయ్యి మెగావాట్లు. వీటికోసం రూ.87,520 కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు. ఇక అడవివరంలో దేవదాయ శాఖకు చెందిన 160 ఎకరాలను లీజు ప్రాతిపదికన కేటాయించారు.

ఈ వార్తలనూ చదవండి:

మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల ఉచిత బియ్యం.. సీఎం చంద్రబాబు ఆదేశాలు

పర్యాటకం జోరు

Updated Date - Sep 27 , 2026 | 05:16 AM