Share News

ధ్యానంతో ఒత్తిడిని అధిగమించొచ్చు

ABN , Publish Date - Jul 30 , 2026 | 12:40 AM

పోలీస్‌ సిబ్బంది శారీరక, మానసిక ఒత్తిడిని అధిగమించి సమర్థవంతంగా విధులు నిర్వహించేందుకు ధ్యానం ఎంతో ఉపయోగపడుతుందని రిటైర్డ్‌ డీజీపీ ఆదిత్య ఆర్య పేర్కొన్నారు.

ధ్యానంతో ఒత్తిడిని అధిగమించొచ్చు
విశ్రాంత డీజీపీకి జ్ఞాపికను అందజేస్తున్న ఎస్పీ

విశ్రాంత డీజీపీ ఆదిత్య ఆర్య

నంద్యాల క్రైమ్‌, జూలై 29 (ఆంధ్రజ్యోతి): పోలీస్‌ సిబ్బంది శారీరక, మానసిక ఒత్తిడిని అధిగమించి సమర్థవంతంగా విధులు నిర్వహించేందుకు ధ్యానం ఎంతో ఉపయోగపడుతుందని రిటైర్డ్‌ డీజీపీ ఆదిత్య ఆర్య పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని రామకృష్ణ పీజీ కళాశాలలో జిల్లా పోలీస్‌ సూపరిండెంట్‌ సునీల్‌ షెరాన్‌ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా పోలీస్‌ సిబ్బందికి ప్రత్యేక మెడిటేషన్‌ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆదిత్య ఆర్య మాట్లాడుతూ ప్రతిరోజు కొద్దిసేపు ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మెరుగుపడుతుందని, కోప నియంత్రణ, భావోద్వేగ సమతుల్యత కూడా పెంపొందుతాయని వివరించారు. ఎస్పీ మాట్లాడుతూ పోలీస్‌ అధికారులు, సిబ్బంది ఈ శిక్షణలో నేర్చుకున్న ధ్యాన పద్ధతులను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. అడిషనల్‌ ఎస్పీ ఎస్‌. ఖాదర్‌ బాషా, ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ చిన్నిక్రిష్ణ, ఏఆర్‌ డీఏస్పీ శ్రీనివాసరావు, రామకృష్ణ విద్యాసంస్థల అధినేత రామకృష్ణారెడ్డి, జిల్లా పోలీస్‌ అధికారులు, వివిధ విభాగాల పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 30 , 2026 | 12:40 AM