సమస్యల పరిష్కారానికి కృషి
ABN , Publish Date - May 18 , 2026 | 11:57 PM
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఇన్‌చార్జి కార్పొరేషన్ కమిషనర్ ఆర్‌జీవీ కృష్ణ అన్నారు.
కర్నూలు న్యూసిటీ, మే 18(ఆంధ్రజ్యోతి): సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఇన్‌చార్జి కార్పొరేషన్ కమిషనర్ ఆర్‌జీవీ కృష్ణ అన్నారు. నగరంలోని ఎస్‌బీఐ కాలనీలోని సమావేశ భవనంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. నగరంలోని వివిధ కాలనీలకు చెందిన ప్రజల నుంచి 11 అర్జీలను ఇన్‌చార్జి కమిషనర్ స్వీకరించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సతీష్‌కుమార్‌రెడ్డి, ఎస్‌ఈ రమణమూర్తి, మేనేజర్ జునీద్, ప్రజారోగ్య అధికారి డా.ఎం.రఘు,కార్యదర్శి నాగరాజు, ఆర్‌ఓ స్వర్ణలత, టిడ్కో అధికారి పెంచలయ్య, సర్వేయర్ మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.
ప్రజల నుంచి వచ్చిన అర్జీలు
అశోక్‌నగర్ పంప్‌హౌస్ నుంచి వెంకటరమణ కాలనీ హరిత హోటల్ వరకు ఫుట్‌పాత్‌లపై ఉన్న చిరువ్యాపారుల దుకాణాలను తొలగించవద్దని దుకాణాల యజమానులు కోరారు. నగర పాలక పరిధిలోని 24వ వార్డు లక్ష్మీనగర్ చివరి లైన్‌లో డ్రైనేజీ కాలువల నిర్మాణం చేపట్టాలని ఏపీ రజిక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి సి.గురుశేఖర్ కోరారు. నగర అధ్యక్ష, కార్యదర్శులు శేషాద్రి, రాముడు, సీహెచ్.శ్రీనివాసులు, వెంకటరమణ, రాము తదితరులు ఉన్నారు. 32వ వార్డులో తాగునీటి పైప్‌లైన్‌లు వేయాలని సీపీఎం నాయకులు సుధాకరప్ప, సీహెచ్.సాయిబాబ, ప్రభాకర్, హుస్సేన్ కోరారు. సుధాకరప్ప మాట్లాడుతూ వార్డు పరిదిలోని ముజఫర్‌నగర్, సుందరయ్య నగర్, గంగావతి నగర్, గోవర్దన్ నగర్‌లో ప్రస్తుత జనాభాకు అనుగుణంగా మంచినీటి పైప్‌లైన్ వేయాలని విజ్ఞప్తి చేశారు. ఆనంద్, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.