Share News

ప్రజా సమస్యలు పరిష్కరిస్తాం: ఎమ్మెల్యే

ABN , Publish Date - Mar 13 , 2026 | 12:32 AM

ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే మండల స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు.

ప్రజా సమస్యలు పరిష్కరిస్తాం: ఎమ్మెల్యే
ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

ఉయ్యాలవాడ, మార్చి 12(ఆంధ్రజ్యోతి): ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే మండల స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. ఉయ్యాలవాడ మండల పరిషత్‌ కార్యాలయంలో గురువారం మండల స్థాయి నాయకులు, అధికారుతో సమావేశం నిర్వహించారు. ప్రజల నుంచి 125 మంది అర్జీలు ఇచ్చినట్లు ఎంపీడీవో ఉమామహేశ్వరరావు తెలిపారు.

కేసీ కెనాల్‌కు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ను అనుసంధానం చేస్తాం

హరివరం కేసీకెనాల్‌ చానల్‌కు స్థానిక కుందూనది నుంచి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ను ఏర్పాటు చేసి రైతులకు సాగునీటి కష్టాలు లేకుండా చేస్తామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రైతులకు హామీ ఇచ్చారు. దీంతో పడిగెపాడు, సుద్దమల్ల, ఉయ్యాలవాడ గ్రామాలకు అదనంగా ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందింవచ్చన్నారు. కేసీ కెనాల్‌కు నీళ్లు రానప్పుడు ఈ లిఫ్ట్‌ రైతులకు ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. దీనికి రూ. 50 కోట్ల అవసరం అవుతున్నట్లు అంచనాలు వేశామన్నారు. అలాగే రైతులు వరి పంటలకు బదులుగా పండ్ల తోటల సాగుపై మొగ్గు చూపాలన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 30 వేల కోట్లు కేటాయించిందన్నారు. మండల టీడీపీ కన్వీనర్‌ బోరెడ్డి శేఖర్‌రెడ్డి, సీనియర్‌ నాయకుడు కూడాల నారాయణరెడ్డి, మారంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, పేరెడ్డి మోహన్‌రెడ్డి, నర్శిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 13 , 2026 | 12:32 AM