Share News

ప్రజా సమస్యలు పరిష్కరిస్తాం

ABN , Publish Date - Jun 18 , 2026 | 11:57 PM

గ్రామాల్లో ఉన్న ప్రధాన సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడమే కాకుండా ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు.

ప్రజా సమస్యలు పరిష్కరిస్తాం
పెండేకల్‌ ఆర్‌ఎస్‌లో ప్రజలతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు

తుగ్గలి, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో ఉన్న ప్రధాన సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడమే కాకుండా ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు. మండలంలోని పెండేకల్‌ ఆర్‌ఎస్‌ గ్రామాన్ని సందర్శించారు. అలాగే గ్రామంలోని ప్రజలు వివిద సమస్యలపై వినతులు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పించన్లు డబుల్‌ చేయడంతో పాటు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. అంతేగాకుండా ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టామని, తాగు, సాగునీటి సమస్యలు లేకుండా ఎప్పటికప్పుడు ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. త్వరలోనే నూతన పింఛన్లు అందిస్తామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మసాల శ్రీను, డా.చంద్ర, చాంద్‌బాషా, నాగరాజు, లాలెప్ప, రఫీ, అమీనా, తదితరులు పాల్గొన్నారు.

సీఎంఆర్‌ఎఫ్‌ పేదలకు వరం

పత్తికొండ: ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌) పేదలకు వరమని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు. గురువారం పత్తికొండ క్యాప్‌ కార్యాలయంలో రూ.17 లక్షలు సీఎంఆర్‌ చెక్కులను అర్హులైన లబ్దిదారులకు అందజేశారు. టీడీపీ నాయకులు ఉన్నారు.

Updated Date - Jun 18 , 2026 | 11:57 PM