Share News

ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతాం

ABN , Publish Date - Mar 18 , 2026 | 12:38 AM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలను ఉధృతం చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామాంజనేయులు పేర్కొన్నారు.

ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతాం
మాట్లాడుతున్న రామాంజనేయులు

నంద్యాల రూరల్‌, మార్చి 17(ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలను ఉధృతం చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామాంజనేయులు పేర్కొన్నారు. మంగళవారం సీపీఐ కార్యాలయంలో జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ అమెరికా, ఇజ్రాయెల్‌ సంయుక్తంగా ఇరాన్‌పై దాడి చేయడాన్ని ఖండించారు. అనంతరం రంగనాయుడు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఏప్రిల్‌ 9న కొలిమిగుండ్ల రామ్‌కో సిమెంట్‌ ప్యాక్టరీ ఎదుట నిర్వహించనున్న ధర్నాలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ నాయకులు సుంకయ్య, రాముడు, భార్గవ్‌, నాగరాముడు, మురళీధర్‌, లక్ష్మీదేవి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 18 , 2026 | 12:38 AM