ఓటుతోనే భవిష్యత్తు
ABN , Publish Date - Jan 26 , 2026 | 12:04 AM
ప్రజలకు ఓటే వజ్రాయుధమని, ఓటుతోనే భవిష్యత్తు ఉంటుందని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనూరాధ, తహసీల్దార్ రమాదేవి అన్నారు.
మంత్రాలయం, జనవరి 25(ఆంధ్రజ్యోతి): ప్రజలకు ఓటే వజ్రాయుధమని, ఓటుతోనే భవిష్యత్తు ఉంటుందని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనూరాధ, తహసీల్దార్ రమాదేవి అన్నారు. ఆదివారం జాతీయ ఓటర్‌దినోత్సవంలో బాగంగా తహసీల్దారు కార్యాలయం నుంచి రాఘవేంద్ర సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం చేశారు. ఎన్నికల డిప్యూటీ తహసీల్దారు జీకే గురురాజరావు ఆధ్వర్యంలో సీనియర్‌సిటిజన్‌లకు శాలువ,పూలమాలువేసి ఘనంగా సత్కారించారు. పాఠశాల, కళాశాల విద్యార్థులతో ఓటరు దినోత్సవంపై వ్యాసరచన, వక్తృత్వపు పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. డిప్యూటీ తహసీల్దార్లు రాఘవేంద్ర, సరస్వతి, వీఆర్వోలు భీమన్నగౌడు, భీముడు, వీరేశ్, ఎర్రప్ప, రాజు, అల్లాబకాష్ తదితరులు పాల్గొన్నారు.
కౌతాళం: ఓటును వినియోగంచుకొని తలరాతను మార్చుకుందామని తహసీల్దార్ రజినీకాంత్ రెడ్డి అన్నారు. కౌతాళం ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మారుతీ మోహన్, వెంకటపతిరాజు, రాజానందు, అడివప్పగౌడ్ పాల్గొన్నారు.
ఎమ్మిగనూరు రూరల్: ఓటే ఓ వజ్రాయుధమని, మన భవిష్యత్తు మనం వేసే ఓటుపై ఆధారపడి ఉంటుందనిఇన్‌చార్జి తహసీల్దార్ శ్రీనివాసులు, ఎన్నికల డీటీ వలిబాషా అన్నారు. ఆదివారం 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా తహసీల్దార్ కార్యాలయం నుంచి పట్టణ పురవీధుల గుండా విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. రెవెన్యూ సిబ్బంది, విద్యార్థులు, ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.
నందవరం: ఓటు వజ్రయుధంలాంటిదని ఎస్‌ఐ తిమ్మారెడ్డి, రీసర్వే డిప్యూటీ తహసీల్దారు మహేశ్ అన్నారు. అదివారం నందవరంలో ఓటర్ల దినోత్స సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ రవీంద్రరెడ్డి, సర్వేయర్లు, వీఆర్వోలు, బీఎల్‌వోలు, విద్యార్థులు పాల్గొన్నారు.
గోనెగండ్ల: ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని డిప్యూటీ తహసీల్దార్ రఘువీర సూచించారు. గోనెగండ్లలో రెవెన్యూ సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు.