Share News

ఉరుకుంద హుండీ ఆదాయం రూ. 1.23 కోట్లు

ABN , Publish Date - Aug 15 , 2026 | 12:43 AM

మండలంలోని ఉరుకుంద ఈరన్న స్వామి దేవస్థానంలో భక్తులు సమర్పించిన కానుకల హుండీని దేవస్థానపు కాలక్షేపపు మండపంలో శక్రవారం ఆలయ డిప్యూటీ కమిషనర్‌, ఈవో వాణి, పాలక మండలి సభ్యుల ఆధ్వర్యంలో లెక్కించారు.

ఉరుకుంద హుండీ ఆదాయం రూ. 1.23 కోట్లు
హుండీ లెక్కింపును పర్యవేక్షిస్తున్న ఈవో

కౌతాళం, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఉరుకుంద ఈరన్న స్వామి దేవస్థానంలో భక్తులు సమర్పించిన కానుకల హుండీని దేవస్థానపు కాలక్షేపపు మండపంలో శక్రవారం ఆలయ డిప్యూటీ కమిషనర్‌, ఈవో వాణి, పాలక మండలి సభ్యుల ఆధ్వర్యంలో లెక్కించారు. ఈవో మాట్లాడుతూ భక్తులు స్వామి వారికి సమర్పించిన 53 రోజుల హుండీ కానుకల్లో రూ.1,23,74,553 నగదు, బంగారము 11.200 గ్రాములు, వెండి 11.290 కిలోలు వచ్చినట్లు తెలిపారు. హుండీ పర్యవేక్షణ అధికారి సుధాకర్‌ రెడ్డి, ఆలయ అధికారులు మల్లికార్జున, వెంకటేశ్వరరావు, దేవాలయపు ప్రధాన, ఉప అర్చకులు ఈరప్ప స్వామి, మహదేవప్ప పాల్గొన్నారు.

Updated Date - Aug 15 , 2026 | 12:43 AM