ఉపాధ్యాయ సమస్యలపై రాజీలేని పోరాటం: ఏపీటీఎఫ్
ABN , Publish Date - Mar 27 , 2026 | 12:44 AM
ఉపాధ్యాయ సమస్యలపై ఏపీటీఎఫ్ రాజీలేని పోరాటం చేస్తోందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు హృదయరాజు అన్నారు.
ఎమ్మిగనూరు, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ సమస్యలపై ఏపీటీఎఫ్ రాజీలేని పోరాటం చేస్తోందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు హృదయరాజు అన్నారు. గురువారం పట్టణంలోని వీవర్స్ కాలనీ జడ్పీ ఉన్నత పాఠశాలలో సంఘం జిల్లా అధ్యక్షులు ఇస్మాయిల్ అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. ఇతర ఉపాధ్యాయ సంఘాలకు చెందిన పలువురు ఉపాధ్యాయులు ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు హృదయ రాజు సమక్షంలో సంఘంలో చేరారు. హృదయరాజు మాట్లా డుతూ ఏపీటీఎఫ్ సంఘాన్ని జిల్లా పశ్చిమ ప్రాంతంలో బలోపేతం చేసేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పూజారి లక్ష్మయ్య ఆధ్వ ర్యంలో సంఘంలో చేరిన ఉపాధ్యాయులు ఏపీటీఎఫ్ సభ్యత్వాన్ని స్వీకరించారు. నాయకులు మరియానందం, ఆనందరాజు, మధుసుధన్ రెడ్డి, సయ్యద్ అహ్మద్, రమేష్, ఏసుదాసు, భగవాన్, గోపాలు, రాఘవేంద్ర, జోజప్ప, రాజేష్, కేశన్న, శ్రీరాములు పాల్గొన్నారు.