వ్యాపారులు నిబంధనలు పాటించాలి
ABN , Publish Date - Mar 18 , 2026 | 12:32 AM
శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులకు అందించే ఆహార పదార్థాల తయారీ, పంపిణీలలో కనీస నిబంధనలు పాటించాలని జిల్లా ఫుడ్ సేఫ్టి అధికారులు సూచించారు.
శ్రీశైలం, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులకు అందించే ఆహార పదార్థాల తయారీ, పంపిణీలలో కనీస నిబంధనలు పాటించాలని జిల్లా ఫుడ్ సేఫ్టి అధికారులు సూచించారు. మంగళవారం క్షేత్ర పరిధిలోని ఓ హోటల్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, స్వీట్‌షాపుల యజమానులకు కీలక సూచనలు చేశారు. ఆహార పదార్థాల తయారీలో శుచి శుభ్రతను తప్పక పాటించాలని అదే విధంగా వినియోగదారులకు అందించే క్రమంలో నిబంధనలు పాటించాలని సూచించారు. ఉగాది మహోత్సవాల సంద ర్భంగా వచ్చిన అధికారులు పలు వ్యాపార కేంద్రాలను పరిశీలించినట్లు చెప్పారు. ఆహార భద్రతా ప్రమాణాల చట్టం అనుసరించకుండా నిబంధనలను నిర్లక్ష్యం చేస్తూ వ్యాపారాలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇష్టానుసారంగా భక్తుల నుంచి అధిక ధరలు వసూలు చేయకూడదన్నారు. కార్యక్రమంలో ఫుడ్ ఇన్‌స్పెక్టర్ వెంకటరాముడు, అధికారి ఖాశీంవలి, రాజగోపాల్, లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్ అనిత, సివిల్ సప్లై తహసీల్దార్ శ్రీనివాసరావు, శ్రీశైల వాణిజ్య సముదాయాల అధ్యక్షుడు రమణ, అపూర్వ నరేందర్‌రెడ్డి, ఐలాపురం సతీష్, నాయుడు నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.