Share News

35ఏళ్ల తర్వాత ఒకేచోటుకు..

ABN , Publish Date - Jan 11 , 2026 | 11:18 PM

మంత్రాలయం జడ్పీ ఉన్నత పాఠశాలలో 1990-91 పదో తరగతి చదువుకున్న విద్యార్థులు 35 ఏళ్ల తర్వాత కలిశారు.

35ఏళ్ల తర్వాత ఒకేచోటుకు..
గురువులతో పూర్వ విద్యార్థులు

మంత్రాలయం, జనవరి 11(ఆంధ్రజ్యోతి): మంత్రాలయం జడ్పీ ఉన్నత పాఠశాలలో 1990-91 పదో తరగతి చదువుకున్న విద్యార్థులు 35 ఏళ్ల తర్వాత కలిశారు. ఆదివారం పట్టణంలోని ఉన్నత పాఠశాల ఆవరణలో దాదాపు 75 మంది పూర్వ విద్యార్థులు కలుసుకున్నారు. చదువు చెప్పిన గురువులు విశ్వేశ్వర రావు, ఇస్మాయిల్‌, కృష్ణమూర్తికి జ్ఞాపిక, పట్టు శాలువ, పూలమాలలు, పండ్లు, బహుమతులు ఇచ్చి సత్కారించారు. అనంతరం పాఠశాలలో తాము చదువుకున్న తరగతి గదిని చూసి అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. పాఠశాలకు ప్రింటర్‌ను విరాళంగా ఇస్తామని చెప్పారు. సూర్యనారాయణ శెట్టి, ఆడిట్‌ శంకర్‌, దానియేలు, మాబు,శ్రీకాంత్‌, గురునాథ్‌ రెడ్డి, మస్తాన్‌, భగీరథీ, గీత, వాణి, సుధాబాయ్‌, సరోజ, వాసవి, సుజాత, కాశీం, కృష్ణయ్య, మల్లికార్జున శెట్టి, రాముడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2026 | 11:18 PM