గణేశ్ నిమజ్జనానికి గట్టి బందోబస్తు: ఎస్పీ
ABN , Publish Date - Sep 16 , 2026 | 12:25 AM
గణేశ్ నిమజ్జనానికి గట్టి బందోబస్తు చేపడుతున్నట్లు ఎస్పీ సునీల్ షెరాన్ తెలిపారు.
పాములపాడు, వెలుగోడు, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): గణేశ్ నిమజ్జనానికి గట్టి బందోబస్తు చేపడుతున్నట్లు ఎస్పీ సునీల్ షెరాన్ తెలిపారు. ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్, సీఐ సురేష్‌కుమార్, ఎస్‌ఐలతో కలిసి మంగళవారం ఎర్రగూడూరు గ్రామ శివార్లలోని తెలుగుగంగ, వెలుగోడులో నిమజ్జనం చేయనున్న వినాయక ఘాట్‌లను పరిశీలించారు. సీఐలు, ఎస్‌ఐ తిరుపాలు సిబ్బంది పాల్గొన్నారు.
జూపాడుబంగ్లా: గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో ఎటువంటి ఘటనలు జరగకుండా జాగ్రతలు తీసుకోవాలని ఎస్పీ సునీల్ షెరాన్ సూచించారు. జూపాడుబంగ్లా వద్ద కేసీ కాలువలో నిమజ్జనం చేసే ప్రాంతాన్ని మంగళవారం పరిశీలించారు. డీఎస్పీ రామాంజనేయులు, సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్‌ఐ మల్లికార్జున పాల్గొన్నారు.
ఆత్మకూరు: ఆత్మకూరు పట్టణంలో బుధవారం జరగనున్న వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకుని మంగళవారం జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ పర్యటించారు. పట్టణంలోని గౌడ్‌సెంటరు, తిక్కస్వామిదర్గా సెంటర్, అమ్మవారిశాల తదితర ఏరియాల్లో పర్యటించి స్థానిక పోలీసు అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ఆయన వెంట ఆత్మకూరు డీఎస్పీ రామాంజీనాయక్, అర్బన్, రూరల్ సీఐలు మహేశ్వరరెడ్డి, సురేష్‌కుమార్‌రెడ్డి తదితరులు ఉన్నారు.