లడ్డూను కల్తీ చేసిన నిందితులను శిక్షించాలి: టీడీపీ
ABN , Publish Date - Jan 30 , 2026 | 12:11 AM
తిరుమల లడ్డూ కల్తీ జరిగిందని సిట్ నివేదిక బట్టబయలు చేసిందని, దీంతో వైసీపీ నాయకులు చేసిన మహాపాపం బట్టబయలు అయ్యిందని, కల్తీకి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బాస్కర్ల చంద్రశేఖర్, మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లయ్య కోరారు.
ఎమ్మిగనూరు, జనవరి 29(ఆంధ్రజ్యోతి): తిరుమల లడ్డూ కల్తీ జరిగిందని సిట్ నివేదిక బట్టబయలు చేసిందని, దీంతో వైసీపీ నాయకులు చేసిన మహాపాపం బట్టబయలు అయ్యిందని, కల్తీకి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బాస్కర్ల చంద్రశేఖర్, మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లయ్య కోరారు. గురువారం పట్టణంలోని టీడీపీ కార్యాలయం నుంచి వెంకటసాయి ఆలయం వరకు నాయకులు ర్యాలీగా వెళ్లి ఆలయంలో స్వామికి పూజలు చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ వైసీపీ పాలనలో కల్తీనెయ్యిని కొనుగోలు చేసి దాంతోనే స్వామివారి పవిత్రమైన ప్రసాదంగా భావించే లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేయించి వైసీపీ నాయకులు మహాపాపం చేశారన్నారు. ఈ పాపాన్ని దేవదేవుడు వేంకటేశ్వర స్వామి ఎన్నటికి క్షమించరని అన్నారు. ఎంబీ మహేష్, మిన్నప్ప, కలీముల్లా, గోపాల్, రామకృష్ణ, వీరేంద్ర, రవి, లచ్చప్ప, నరసప్ప, రాఘవేంద్ర, వెంకటేశ్, ఉరుకుందు, తిరుపతయ్యనాయుడు, మాజీ కౌన్సిలర్ శంకరమ్మ, విజయలక్ష్మి పాల్గొన్నారు.
నందవరం: ఎవరు చేసిన పాపం వారు అనుభవించాలని టీడపీ మండల కన్వీనర్ కాశీంవలి అన్నారు. నందవరం టీడీపీ పార్టీ కార్యాలయంలోగురువారం వైసీపీ నాయకులు చేసిన మహపాపం ప్రతులను వారు ప్రదర్శించారు. తిరుమల వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేయడం మహాపాపం అని అన్నారు. నాయకులు సత్యారెడ్డి, బజారి, గోపాల్, భీమన్న పాల్గొన్నారు.