కేసీ కల్కూర సేవలు అభినందనీయం
ABN , Publish Date - Jul 06 , 2026 | 12:06 AM
ప్రముఖ సామాజిక, సాహితీవేత్త, కళారత్న పురస్కార గ్రహీత కేసీ కల్కూర నిర్వహిస్తున్న సామాజిక సేవలు అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్ అన్నారు.
కర్నూలు కల్చరల్, జూలై 5 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ సామాజిక, సాహితీవేత్త, కళారత్న పురస్కార గ్రహీత కేసీ కల్కూర నిర్వహిస్తున్న సామాజిక సేవలు అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్ అన్నారు. ఇటీవల కళారత్న పురస్కారం అందుకున్న కేసీ కల్కూర అభినందన సభను ఆదివారం పాతనగరంలోని జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ సంస్థ సమావేశ హాలులో నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన టీజీ వెంకటేశ్ మాట్లాడుతూ.. కేసీ కల్కూర చేసిన మంచి పనులు పుస్తక రూపంలో తీసుకువస్తే పుస్తక ముద్రణకు తన సహాయ సహాకారాలు ఉంటాయని తెలిపారు. రవీంద్ర, మాంటిస్సోరి విద్యాసంస్థల అధినేతలు జి. పుల్లయ్య, కేఎన్‌వీ రాజశేఖర్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు విజయకుమార్ రెడ్డి, ఏపీఎస్పీ డీఎస్పీ మహబూబ్ బాషా, తెలుగు భాషా వికాస ఉద్యమం రాష్ట్ర కార్యదర్శి జేఎస్‌ఆర్‌కే శర్మ, గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ కేజీ గంగాధరరెడ్డి, టీడీపీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్ష కార్యదర్శులు పి. హనుమంతరావు చౌదరి, పద్మాచౌదరి, సాహితీవేత్తలు ఎలమర్తి రమణయ్య, మజ్జూరు లక్ష్మయ్య, ఎస్‌డీవీ అజీజ్, గౌరెడ్డి హరిశ్చంద్రారెడ్డి, గ్రంథాలయ అధికారి వి. పెద్దక్కలతోపాటూ పలువురు సాహితీవేత్తలు, సామాజిక సేవకులు, విశ్రాంత ఉద్యోగులు, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సండేల్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వేద ఆశీర్వాదం అందజేయగా, టీజీ వెంకటేశ్, జి. పుల్లయ్య, కేఎన్‌వీ రాజశేఖర్ ఆధ్వర్యంలో కేసీ కల్కూర దంపతులను ఘనంగా సత్కరించారు.