పారిశుధ్య కార్మికుల సేవలు మరువలేనివి
ABN , Publish Date - Mar 12 , 2026 | 01:09 AM
పట్టణాన్ని ఎంతో పరిశుభ్రంగా ఉంచడంలో నిత్యం శ్రమించే పారిశుధ్య కార్మికుల సేవలు మరువలేనివి అని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అన్నారు.
ఆదోని/ఆదోని టౌన్, మార్చి 11(ఆంధ్రజ్యోతి): పట్టణాన్ని ఎంతో పరిశుభ్రంగా ఉంచడంలో నిత్యం శ్రమించే పారిశుధ్య కార్మికుల సేవలు మరువలేనివి అని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద బుధవారం పారిశుధ్య కార్మికులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం తరపున మెమెంటోలతో పాటు చీరలు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులకు తన సహకారం ఎల్లవేళలా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహమ్మద్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సందీప్, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.
సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ: క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే డా.పార్థసారథి బుధవారం 12మందికి రూ.7.63లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సామాన్యులు, మధ్య తరగతికి చెందిన వారు అనారోగ్యం భారిన పడిన సందర్భాలలో ఎంతమందికి అయినా ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. నాగరాజ్ గౌడ్, ఉపేంద్ర కుమార్, విజయ కృష్ణ, శ్రీనివాస ఆచారి, దేశాయ్ చంద్రన్న పాల్గొన్నారు. .