పార్టీని బలోపేతం చేయాలి : ఎస్వీ
ABN , Publish Date - Jan 24 , 2026 | 12:34 AM
గ్రామస్థాయి నుంచి వైసీపీని బలోపేతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు.
ఎమ్మిగనూరు, జనవరి 23(ఆంధ్రజ్యోతి): గ్రామస్థాయి నుంచి వైసీపీని బలోపేతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మిగనూరు పట్టణ సమీపంలోని ఆదోని రోడ్డులో ఉన్న విశాలగార్డెన్‌లో వైసీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం ఆపార్టీ ఇన్‌చార్జీ కడిమెట్ల రాజీవ్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి, కర్నూలు పార్లమెంటు సమన్వయ కర్త, మాజీ ఎంపీ బుట్టా రేణుక, నాయకులు ఎర్రకోట జగన్మోహాన్ రెడ్డి, ఎస్వీ విజయమనోహరి, మున్సిపల్ చైర్మన్ డా రఘు, వైస్‌చైర్మన్ నజీర్ హాజరయ్యారు. ఎస్వీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ నియోజవర్గంలోని ప్రతి గ్రామంలో గ్రామ కమిటీలు వేయటంతో పార్టీ అనుబంధ కమీటీలు వేయాలన్నారు. చెన్నకేశవ రెడ్డి మాట్లాడుతూ నియోజవర్గంలో పార్టీ శ్రేణులు కలిసి పనిచేయాలని సూచించారు. బుట్టా రేణుక మాట్లాడుతూ అధినేత సూచనల మేరకు పనిచేస్తామన్నారు. అనంతరం రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చిన అండగా ఉంటామన్నారు. ఈ సమావేశానికి వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై రుద్రగౌడ్, ఆయన అనుచరులు, ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కేఆర్ మురహరి రెడ్డి సైతం సమావేశానికి హాజరుకాకపోవటం చర్చనీయాంశంగా మారింది. సమావేశంలో ఎంపీపీ కేశన్న, సీనియర్ నాయకులు బీఆర్ బసిరెడ్డి, భీమి రెడ్డి, లక్ష్మీకాంత రెడ్డి, బుట్టా రంగయ్య, రియాజ్, గడ్డం నారాయణ రెడ్డి, విరుపాక్షి రెడ్డి, షబ్బీర్ పాల్గొన్నారు.