Share News

ఉపాధి హామీ పథకం పేరును యథావిధిగా కొనసాగించాలి: కాంగ్రెస్‌

ABN , Publish Date - Jan 25 , 2026 | 12:11 AM

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును యథావిధిగా కొనసాగించాలని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌ కాశీంవలి, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు వీరేశ్‌యాదవ్‌ డిమాండ్‌ చేశారు.

ఉపాధి హామీ పథకం పేరును యథావిధిగా కొనసాగించాలి: కాంగ్రెస్‌
ఉపాధి కూలీలతో కలిసి నిరసన తెలుపుతున్న నాయకులు

ఎమ్మిగనూరు రూరల్‌, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును యథావిధిగా కొనసాగించాలని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌ కాశీంవలి, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు వీరేశ్‌యాదవ్‌ డిమాండ్‌ చేశారు. మండలంలోని కలుగొట్ల గ్రామంలో శనివారం ఉపాధి కూలీలతో కలిసి నిరసన తెలిపారు. నాయకులు మాట్లాడుతూ పేద కూలీల కోసం అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. అయితే ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం పేరును వీబీజీ రామ్‌జీగా మార్చాలని చూడడం సరికాదన్నారు. వెంటనే బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో దశలవారి ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ముస్తఫ, ముల్లా, ఓసమ్మ, శేషాద్రి, మాబాషా, రఫిక్‌, భాస్కర్‌, విష్ణు పాల్గొన్నారు.

Updated Date - Jan 25 , 2026 | 12:11 AM