Share News

కార్తిక మాసం.. అత్యంత పవిత్రం

ABN , Publish Date - Nov 26 , 2026 | 12:33 AM

అత్యంత పవిత్రమైన కార్తిక మాసంలో శ్రీశైల మహా క్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు.

 కార్తిక మాసం.. అత్యంత పవిత్రం
కార్తిక దీపాలు వెలిగిస్తున్న బుడ్డా రాజశేఖరరెడ్డి దంపతులు

శ్రీశైలం, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): అత్యంత పవిత్రమైన కార్తిక మాసంలో శ్రీశైల మహా క్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు. బుధవారం ఆయన సతీమణి బుడ్డా శైలజతో కలిసి ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకున్న వారికి ఈవో శ్రీనివాసరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసుకున్న వారు ఉసిరి, ఆవునెయ్యితో కలిపిన కార్తిక దీపాలు వెలిగించి ఆదిదంపతులకు దీపనీరాజనాలు సమర్పించుకున్నారు.

Updated Date - Nov 26 , 2026 | 12:33 AM