గుంతలు లేని రోడ్లే లక్ష్యం: కమిషనర్
ABN , Publish Date - Mar 14 , 2026 | 12:44 AM
నగర పరిధిలో గుంతల రహిత రహదారులే ప్రభుత్వ లక్ష్యమని నగర పాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ అన్నారు.
కర్నూలు న్యూసిటీ, మార్చి 13(ఆంధ్రజ్యోతి): నగర పరిధిలో గుంతల రహిత రహదారులే ప్రభుత్వ లక్ష్యమని నగర పాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ అన్నారు. శుక్రవారం ఆయన క్రిష్ణానగర్ ఐటీసీ, గుత్తి పెట్రోల్ బంక్ ప్రాంతాల్లో జరుగుతున్న గుంతల పూడ్చివేత పనులను పరిశీలించారు. కమిషనర్ మాట్లాడుతూ నగర పరిధిలో రూ.87 లక్షల వ్యయంతో మొత్తం 487 గుంతలను పూడ్చివేస్తున్నట్లు తెలిపారు. వీకర్ సెక్షన్ కాలనీలో డ్రైనేజీ కాలువల్లో ఉన్న తాగునీటి పైపులను పరిశీలించారు. ఎస్‌ఈ జె.రమణమూర్తి, ఎంఈలు మనోహర్‌రెడ్డి, గిరిరాజ్, ఏఈ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
నగర పరిధిలో నదులు, కాలువల్లో గుర్రపు డెక్కల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని నగర పాలకె సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ ఆదేశించారు. శుక్రవారం నగరేశ్వర ఆలయం సమీపంలోని తుంగభద్ర నది పరిసరాలు, కేవీఆర్ కళాశాల సమీపంలోని కేసీ కెనాల్ ప్రాంతా ల్లోని గుర్రపు డెక్కలను ఆయన పరిశీలించారు. కమిషనర్ మాట్లా డుతూ తుంగభద్ర నది, హంద్రీ, కేసీ కెనాల్ ప్రాంతాల్లో గుర్రపు డెక్కల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలి పారు. అవసరమైన చోట్ల డ్రోన్ సాయంతో హైపో ద్రావణాన్ని పిచికారీ చేయనున్నట్లు చెప్పారు. ఎస్‌ఈ జె.రమణమూర్తి, ప్రజారోగ్య అధికారి డా.నాగప్రసాద్‌బాబు, డీఈ శ్రీనివాసన్, ఏఈ స్వాతి పాల్గొన్నారు.