జల వనరుల సంరక్షణే లక్ష్యం
ABN , Publish Date - May 18 , 2026 | 11:55 PM
జలవనరుల సంరక్షణ, అభివృద్ధి నీటి వనరుల సామర్థ్య వినియోగం లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన జలధార-జలహారతి కార్యక్రమం రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.
ఓర్వకల్లు, మే 18 (ఆంధ్రజ్యోతి): జలవనరుల సంరక్షణ, అభివృద్ధి నీటి వనరుల సామర్థ్య వినియోగం లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన జలధార-జలహారతి కార్యక్రమం రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. వంద రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం మండలంలోని శకునాల, తిప్పాయపల్లె గ్రామాల చెరువుల్లో పూడికతీత సుందరీకరణ పనులను ఎమ్మెల్యే భూమి పూజ చేసి ప్రారంభించారు. ఉపాధి హామీ పథకం ద్వారా రూ.కోటితో ఈ పనులు చేపట్టారు. ఎమ్మెల్యే గౌరు చరిత మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరులను సంరక్షించడం, భూగర్భజలాల స్థాయిని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందన్నారు. చెరువుల పునరుద్దరణ, మట్టి తొలగింపు, నీటి నిల్వ సామర్థ్యం పెంపు పనుల కోసం రూ.కోటితో అభివృద్ది పనులు మంజూరు చేయడం జరిగిందన్నారు. జలహారతి కార్యక్రమం ద్వారా చెరువులు అభివృద్ది చెందడంతో రైతులకు సాగునీటి సౌకర్యం మెరుగుపడటంతో పాటు భవిష్యత్తులో నీటి కొరత సమస్య తగ్గే అవకాశం ఉంటుంద న్నారు. దీంతో భూగర్బజలాలు కూడా పెరుగుతాయన్నారు. కార్మికు లకు ఉపాధి అవకాశాలు కల్పిం చడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ నరసింహారెడ్డి, అడిషినల్ పీడీ మాధవీలత, ఏపీడీ పద్మావతి, ఎంపీడీవో నాగఅనుసూయ తహసీల్దార్ విద్యాసాగర్, కోర్సు డైరెక్టర్ నాగ ఎర్రమల, ఏపీవో మద్దేశ్వరమ్మ, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు గోవిందరెడ్డి, మండల కన్వీనర్ బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, సొసైటీ అధ్యక్షులు సీఎన్ సుధాకర్ రెడ్డి, సి.సుధాకర్‌రావు, నాయకులు మౌళీశ్వరరెడ్డి, సుధాకర్ రెడ్డి, చంద్రపెద్దస్వామి, మోహన్ రెడ్డి, లక్ష్మికాంతరెడ్డి, ఆకుల మహేష్, వెంకటరమణ, భాస్కర్ రెడ్డి, పరమేశ్వరరెడ్డి, నాగ మల్లేష్, కోటేశ్వరరావు, మండలంలోని టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.