Share News

గ్రామాభివృద్ధే లక్ష్యం

ABN , Publish Date - May 06 , 2026 | 11:56 PM

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.

గ్రామాభివృద్ధే లక్ష్యం
సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేస్తున్న ఎమ్మెల్యే

పాములపాడు, మే 6 (ఆంధ్రజ్యోతి): గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. మండలంలోని క్రిష్ణరావుపేట గ్రామంలో బుధవారం టీడీపీ నాయకులు రామలింగేశ్వరరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, రామకృష్ణ, జనార్దన్‌తో కలిసి సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో సీసీ రోడ్లకు భూమిపూజలు చేసి శిలఫలకాలకు మాత్రమే పరిమితమయ్యారని, అయితే ఈ ప్రభుత్వంలో పల్లె పండుగ 1,2లో భాగంగా వంద సీసీ రోడ్లకు రూ.5 కోట్లకు పైగా ఖర్చు చేశామని చెప్పారు. అలాగే తాగునీరు, పారిశుధ్యం, కనీస సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయిస్తోందన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ రవీంద్రరెడ్డి, నాయకులు తిమ్మారెడ్డి, సొసైటీ చైర్మన్‌ గోవిందు, హరినాథరెడ్డి, కృష్ణ, హఫీజ్‌, రాము, మల్లీశ్వరరెడ్డి, నాగలక్ష్మిరెడ్డి, హరిప్రసాద్‌, మండల వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 06 , 2026 | 11:56 PM