Share News

భారత సైన్యం పోరాట పటిమ స్ఫూర్తిదాయకం

ABN , Publish Date - Jul 26 , 2026 | 11:47 PM

కార్గిల్‌ యుద్ధంలో పాకిస్తాన్‌ సైన్యంపై భారత సైన్యం చూపిన పోరాట పటిమ స్ఫూర్తి దాయకమని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ అన్నారు.

భారత సైన్యం పోరాట పటిమ స్ఫూర్తిదాయకం
మాట్లాడుతున్న టీజీ వెంకటేశ్‌

కర్నూలు ఎడ్యుకేషన్‌, జూలై 26 (ఆంధ్రజ్యోతి): కార్గిల్‌ యుద్ధంలో పాకిస్తాన్‌ సైన్యంపై భారత సైన్యం చూపిన పోరాట పటిమ స్ఫూర్తి దాయకమని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ అన్నారు. 1999 జూలై 26న కార్గిల్‌ యుద్ధంలో భారత సైన్యం విజయం సాధించిన సందర్బంగా నగరంలోని అమర జవాన్‌ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన సంస్మరణ సభ, కొవ్వొతుల ప్రదర్శన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. టీజీ మాట్లాడుతూ దేశ యువత భారత సైన్యం పోరాట ప్రతి మనస్పూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని కోరారు. మాజీ సైనిక సంఘం అధ్యక్షుడు బాబురాజు, కార్యదర్శి ఫకృద్దీన్‌, కోశాధికారి గణేష్‌, ఉపాధ్యక్షులు మల్లికార్జున, పఠాన్‌షీకాన్‌, రామకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2026 | 11:47 PM