Share News

దివ్యాంగులు ఆర్థికాభివృద్ధి సాధించాలి

ABN , Publish Date - May 08 , 2026 | 12:09 AM

దివ్యాంగులు ఆర్థికాభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే డాక్టర్‌ పార్థసారథి సూచించారు.

దివ్యాంగులు ఆర్థికాభివృద్ధి సాధించాలి
మోటారు ట్రైసైకిళ్లను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే

ఆదోని, మే 7 (ఆంధ్రజ్యోతి): దివ్యాంగులు ఆర్థికాభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే డాక్టర్‌ పార్థసారథి సూచించారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయం ఎదుట దివ్యాంగులకు గురువారం మోటారు ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లా డుతూ దివ్యాంగులు ఆర్థికంగా సామాజికంగా ఎవరిపైనా ఆధార పడకుండా గౌరవప్రదమైన స్వతంత్ర జీవనాన్ని గడపాలన్నదే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఒక్కోటి సుమారు రూ.లక్ష విలువ చేసే ఈ మోటారైజ్డ్‌ వాహనాలు దివ్యాంగుల ప్రయాణ కష్టాలను తీర్చి, వారి ఉపాధి అవకాశాలను మెరుగు పరుస్తాయని ఆయన ఆకాంక్షిం చారు. ఇప్పటికే అర్హులైన వారికి వాహనాలు అందజేశామని, త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మరిన్ని వాహనాలను తెప్పించి, నియోజకవర్గం లోని మిగిలిన లబ్ధిదారులకు కూడా పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.

Updated Date - May 08 , 2026 | 12:09 AM