సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Jan 10 , 2026 | 12:39 AM
కృషి విజ్ఞాన కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం విస్తరణ విభాగం డైరెక్టర్ డాక్టర్ జి. శివనారాయణ తెలిపారు.
ఎమ్మిగనూరు రూరల్, జనవరి 9(ఆంధ్రజ్యోతి): కృషి విజ్ఞాన కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం విస్తరణ విభాగం డైరెక్టర్ డాక్టర్ జి. శివనారాయణ తెలిపారు. మండలంలోని బనవాసి కృషి విజ్ఞాన కేంద్రాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. ఆయనకు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాఘవేంద్ర చౌదరి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేవీకేలో సాగుచేస్తున్న పంటలను ఆయన పరిశీలించారు. అనంతరం డైరెక్టర్ మాట్లాడుతూ కృషి విజ్ఞాన కేంద్రాలు రైతులకు ఆధునిక సాంకేతిక జ్ఞానాన్ని చేరవేస్తూ వ్యవసాయంలో సార్థకమైన మార్పులను తీసుకువస్తున్నాయన్నారు. ఇలాంటి ప్రదర్శనల నుంచి నేర్చుకున్న పద్ధతులను అనంతరం కృషి విజ్ఞాన కేంద్రంలో సాగుచేస్తున్న పంటలతో పాటు సెడ్, నెట్, వర్మీ కంపోస్టు, తేనెటీగల పెంపకం, పశువుల పెంపకం, కోళ్లపెంపక విభాగాలను సందర్శించి సూచనలు అందజేశారు. రైతులకు సూచనలు ఇచ్చారు. కేవీకే శాస్త్రవేత్తలు, యువ నిపుణులు, సిబ్బంది పాల్గొన్నారు.