ఉపాధ్యాయ సమస్యలపై పోరాటం
ABN , Publish Date - Jan 29 , 2026 | 12:16 AM
ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతర పోరాటాలు చేస్తామని ఎస్టీయూ నాయకులు రామచంద్ర, మండల అధ్యక్షుడు తిప్పన్న చెప్పారు.
మంత్రాలయం, జనవరి 28(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతర పోరాటాలు చేస్తామని ఎస్టీయూ నాయకులు రామచంద్ర, మండల అధ్యక్షుడు తిప్పన్న చెప్పారు. ఎస్టీయూ దశల వారీగా పోరాట కరపత్రాలను మంత్రాలయం ఉన్నత పాఠశాలలో బుధవారం ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్న ఉద్యోగుల, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు. దశల వారీగా ఈనెల 30న తహసీల్దార్లకు వినతి పత్రాల సమర్పణ, ఫిబ్రవరి 10న జిల్లా కలెక్టరేట్‌ల ఎదుట ధర్నా, ఫిబ్రవరి 25న ఛలో విజయవాడ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు బసవరాజు, రాజేష్, ప్రసన్నకుమారి, ఉమామహేశ్వరి, సుల్తానా, హరిప్రసాద్, వీరేష్‌రావు, రామదాసు, యశోద తదితరులు పాల్గొన్నారు.