Share News

సాధనకు అనువైన క్షేత్రం శ్రీశైలం

ABN , Publish Date - Sep 17 , 2026 | 12:40 AM

మహిమాన్వితమైన శ్రీశైలం సాధువుల సాధనకు అనువైన క్షేత్రమని ఆంధ్రప్రదేశ్‌ సాధు పరిషత్‌ అధ్యక్షుడు శివానంద సరస్వతి స్వామీజీ అన్నారు.

సాధనకు అనువైన క్షేత్రం శ్రీశైలం
ఈవోతో పీఠాధిపతి, సాధుసంతులు

శ్రీశైలం, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): మహిమాన్వితమైన శ్రీశైలం సాధువుల సాధనకు అనువైన క్షేత్రమని ఆంధ్రప్రదేశ్‌ సాధు పరిషత్‌ అధ్యక్షుడు శివానంద సరస్వతి స్వామీజీ అన్నారు. బుధవారం శ్రీశైల క్షేత్ర పరిధిలోని ఆశ్రమాలు, పీఠాలు, మఠాల నిర్వాహకులు సాధకులతో కలిసి గతంలో సాధుసంతులపై అర్థంలేని ఆం క్షలతో చేసిన తీర్మానాలు, జీవో నెంబరు 58ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఈవో శ్రీనివాసరావుకు వినతిపత్రం అందించారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసుకున్న అనంతరం ఈవోతో మా ట్లాడారు. క్షేత్ర వైభవము, సనాతన ధర్మంపై కనీస అవగాహన లేని అధికారులు తీసుకునే నిర్ణయాలు, తీర్మానాలు జీవోల వల్ల భిక్షువులు, సాధకులు, పీఠాధిపతులు, ఙ్ఞానులు, సిద్దపురుషులైన వారందరికీ జరిగిన అవమానం పునరావృతం కాకుండా జా గ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. సాధు పరిషత్‌ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నారాయణ రావు, శ్రీశైలం సాధుభవన్‌ ట్రస్ట్‌ సెక్రటరి అరవింద్‌రెడ్డి, యోగిని మాత ఆశ్రమ సాధకులు శ్రీనివాసరాజు స్వామి, మౌనస్వామి ఆశ్రమ నిర్వాహకులు ఈవోను కలిశారు.

Updated Date - Sep 17 , 2026 | 12:40 AM