Share News

క్రీడా పోటీలను విజయవంతంగా నిర్వహించాలి

ABN , Publish Date - Sep 24 , 2026 | 12:06 AM

2026 - 2027 సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్‌ అండర్‌ - 19 స్కూల్‌ గేమ్స్‌ పోటీలు పారదర్శకంగా నిర్వహించి విజయవంతం చేయాలని జిల్లా ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ అధికారి శంకర్‌ నాయక్‌ సూచించారు.

క్రీడా పోటీలను విజయవంతంగా నిర్వహించాలి
సమావేశంలో మాట్లాడుతున్న డీఐఈవో శంకర్‌ నాయక్‌

నంద్యాల హాస్పిటల్‌, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): 2026 - 2027 సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్‌ అండర్‌ - 19 స్కూల్‌ గేమ్స్‌ పోటీలు పారదర్శకంగా నిర్వహించి విజయవంతం చేయాలని జిల్లా ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ అధికారి శంకర్‌ నాయక్‌ సూచించారు. బుధవారం అండర్‌ - 19 టోర్నమెంట్‌ నిర్వహణపై నంద్యాలలో ఫిజికల్‌ డైరెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇంటర్మీడియట్‌ అండర్‌ - 19 ఎస్‌జీఎఫ్‌ టోర్నమెంట్స్‌ క్యాలెండర్‌, వివిధ క్రీడా ఈవెంట్స్‌ నిర్వహణ, విద్యార్థుల భాగస్వామ్యం, తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. క్రీడా పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు ఫిజికల్‌ డైరెక్టర్లకు శంకర్‌ నాయక్‌ సూచనలు, సలహాలు అందించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఉమ్మడి కర్నూలు జిల్లా అండర్‌ 19 ఎస్‌జీఎఫ్‌ సెక్రటరీ పి. విజయ భాస్కర్‌ రెడ్డిని డీఐఈవో శంకర్‌ నాయక్‌, కళాశాల సీనియర్‌ ఫిజికల్‌ డైరెక్టర్‌ రియాజ్‌, వివిధ కళాశాలల ఫిజికల్‌ డైరెక్టర్లు సన్మానించారు.

Updated Date - Sep 24 , 2026 | 12:07 AM