విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచాలి
ABN , Publish Date - Jan 08 , 2026 | 12:13 AM
ఉపాధ్యా యులు అర్థమయ్యే రీతిలో బోధించి విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచాలని కర్నూలు డైట్ లెక్చరర్లు గోవిందు, రామాంజనేయులు సూచించారు.
కోసిగి, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యా యులు అర్థమయ్యే రీతిలో బోధించి విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచాలని కర్నూలు డైట్ లెక్చరర్లు గోవిందు, రామాంజనేయులు సూచించారు. ఎంఈవో బాలయ్య ఆధ్వర్యంలో బుధవారం కోసిగిలోని సీజీ, హిందూ గర్ల్స్, బాలికల ఉన్నత పాఠశాలలో రికార్డులను తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు జరిగిన పాఠాలపై వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాలికల ఉన్నత పాఠశాలలో ఎఫ్‌ఏ-3 పరీక్షలను పరిశీలించారు. అనంతరం బాలురు, బాలికల ప్రధానోపాధ్యాయులు జి. పరిమళదేవితో మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజనం సక్రమంగా మెనూ ప్రకారం నాణ్యతతో కూడిన భోజనం విద్యార్థినులకు అందించాలన్నారు. అలాగే వంద రోజుల ప్రణాళికను కచ్చితంగా పాటించాలని సూచించారు.