Share News

కొత్త వైద్య విధానాలపై నైపుణ్యాలను పెంచుకోవాలి

ABN , Publish Date - Apr 12 , 2026 | 11:54 PM

కొత్త వైద్య విధానాలు చికిత్సలపై పీజీ వైద్య విద్యార్థులు నైపుణ్యాలను పెంచుకోవాలని కర్నూలు మెడికల్‌ కాలేజీ వైస్‌ ప్రిన్సిపాల్‌, మెడిసిన్‌ హెచ్‌వోడీ డా.డి.శ్రీరాములు, హాస్పిటల్‌ డిప్యూటీ సూపరింటెండెంట్‌ డా.ఎస్‌.లక్ష్మీబాయి సూచించారు.

కొత్త వైద్య విధానాలపై నైపుణ్యాలను పెంచుకోవాలి
జోనల్‌ సీఎంఈని ప్రారంభిస్తున్న వైస్‌ ప్రిన్సిపాల్‌ శ్రీరాములు, డిప్యూటీ సూపరింటెండెంట్‌ లక్ష్మీబాయి

కర్నూలు హాస్పిటల్‌, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): కొత్త వైద్య విధానాలు చికిత్సలపై పీజీ వైద్య విద్యార్థులు నైపుణ్యాలను పెంచుకోవాలని కర్నూలు మెడికల్‌ కాలేజీ వైస్‌ ప్రిన్సిపాల్‌, మెడిసిన్‌ హెచ్‌వోడీ డా.డి.శ్రీరాములు, హాస్పిటల్‌ డిప్యూటీ సూపరింటెండెంట్‌ డా.ఎస్‌.లక్ష్మీబాయి సూచించారు. ఆదివారం జనరల్‌ మెడిసిన్‌ విభాగం ఆధ్వర్యంలో విశ్వభారతి, శాంతిరాం నంద్యాల గవర్నమెంటు మెడికల్‌ కాలేజీ, కర్నూలు మెడికల్‌ కాలేజీల అనంతపురం జోనల్‌ వైద్య విజ్ఞాన సదస్సు నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఆధునిక వైద్య విధానాలు క్లినికల్‌ డయోగ్నస్టిక్‌ నైపుణ్యాలను విద్యార్థులు పెంచుకోవాలన్నారు. వెర్టిగో కేసుల చికిత్స విధానాలపై న్యూరాలజీ హెచ్‌వోడీ డా.సి.శ్రీనివాసులు, మాక్రోఫేజ్‌ యాక్టివేషన్‌ సిండ్రోమ్‌పై రిటైర్డు ప్రిన్సిపాల్‌ డా.పి.సుధాకర్‌, క్యాన్సర్‌పై మెడికల్‌ ఆంకాలజీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా.కె.శివప్రసాద్‌, నాన్‌ ఆల్కహాల్‌ ప్యాటిలివర్‌పై గ్యాస్ర్టో ఎంట్రాలజీ హెచ్‌వోడీ డా.జి.మోహన్‌ రెడ్డి, కొత్త అంటు వ్యాధులపై మెడిసిన్‌ ప్రొఫెసర్‌ డా.ఎం.మహేశ్వరరెడ్డి, వివిద అంశాలపై ఉపన్యాసాన్ని ఇచ్చారు. సదస్సులో ఏపీఎంసీ అబ్జర్వర్‌ డా.వెంకటేశ్వర్లు విశ్వభారతి మెడికల్‌ కాలేజీ జనరల్‌ మెడిసిన్‌ హెచ్‌వోడీ డా.పి.రవికళాధర్‌ రెడ్డి మెడిసిన్‌ ప్రొఫెసర్లు డా.రాజశేఖర్‌, డా.విద్యా సాగర్‌, కర్నూలు, నంద్యాల, అనంతపురం మెడికల్‌ కాలేజీ వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Apr 12 , 2026 | 11:58 PM