Share News

సమన్వయంతో ‘సర్‌’ను పూర్తి చేయాలి

ABN , Publish Date - Jul 06 , 2026 | 12:07 AM

ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చేపట్టుతున్న నేపథ్యంలో దీన్ని సమర్థవంతంగా, వేగంగా, విజయవంతంగా పూర్తి చేయడానికి బీఎల్‌వోలకు తోడుగా బీఎల్‌ఏలు, విద్యావంతులు, విద్యార్థులు, స్వచ్ఛంద సేవకులు ముందుకు రావాలని కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి(ఈఆర్వో), నగర పాలక కమిషనర్‌ చల్లా ఓబులేసు అన్నారు.

సమన్వయంతో ‘సర్‌’ను పూర్తి చేయాలి
‘సర్‌’ ప్రక్రియను పరిశీలిస్తున్న ఈఆర్వో చల్లా ఓబులేసు

కర్నూలు న్యూసిటీ, జూలై 5(ఆంధ్రజ్యోతి): ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చేపట్టుతున్న నేపథ్యంలో దీన్ని సమర్థవంతంగా, వేగంగా, విజయవంతంగా పూర్తి చేయడానికి బీఎల్‌వోలకు తోడుగా బీఎల్‌ఏలు, విద్యావంతులు, విద్యార్థులు, స్వచ్ఛంద సేవకులు ముందుకు రావాలని కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి(ఈఆర్వో), నగర పాలక కమిషనర్‌ చల్లా ఓబులేసు అన్నారు. ఆదివారం ప్రకాష్‌నగర్‌, రోజా వీధి, ధర్మపేట, లేబర్‌కాలనీ, కప్పల్‌నగర్‌, గాంధీనగర్‌, ఎన్‌ఆర్‌పేట, కంట్రోల్‌ రూమ్‌, బండిమెట్ట తదితర ప్రాంతాల్లోని పోలింగ్‌ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సర్‌ ప్రత్యేక శిబిరాలను ఆయన పరిశీలించారు.

Updated Date - Jul 06 , 2026 | 12:08 AM