Share News

ఈరన్నస్వామికి వెండి విరాళం

ABN , Publish Date - Oct 23 , 2026 | 12:32 AM

ప్రముఖ పుణ్యక్షేత్రం ఉరుకుంద ఈరన్న స్వామివారికి గురువారం ఓ భక్తుడు కిలో వెండి బిస్కెట్‌ను విరాళంగా అందజేసినట్లు ఈవో వాణి తెలిపారు.

ఈరన్నస్వామికి వెండి విరాళం
ఆలయ ఈవో వాణికు వెండిని అందజేస్తున్న భక్తుడు

కౌతాళం, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రం ఉరుకుంద ఈరన్న స్వామివారికి గురువారం ఓ భక్తుడు కిలో వెండి బిస్కెట్‌ను విరాళంగా అందజేసినట్లు ఈవో వాణి తెలిపారు. ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా అయిజకు చెందిన హనుమంతయ్య, వసంతలక్ష్మి కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం దేవాలయ కార్యాలయంలో కిలో వెండి బిస్కెట్‌ను అందజేశారు. దాతలకు ఆలయ అర్చకులు స్వామివారి లడ్డు ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు మల్లికార్జున, వెంకటేశ్వర్లు, సిబ్బంది కిరణ్‌కుమార్‌ ఉన్నారు.

Updated Date - Oct 23 , 2026 | 12:32 AM