Share News

రెండేళ్లలో ఎంతో అభివృద్ధి

ABN , Publish Date - Jun 20 , 2026 | 12:59 AM

కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి చేసిందని కేడీసీసీబీ చైర్మన్‌ విష్ణువర్దన్‌రెడ్డి అన్నారు.

రెండేళ్లలో ఎంతో అభివృద్ధి
మాట్లాడుతున్న కేడీసీసీబీ చైర్మన్‌ విష్ణువర్దన్‌రెడ్డి

కోడుమూరు, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి చేసిందని కేడీసీసీబీ చైర్మన్‌ విష్ణువర్దన్‌రెడ్డి అన్నారు. కోడుమూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఆధ్వర్యంలో శుక్రవారం రెండేళ్ల పాలన విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోడుమూరు, గూడూరు, సి.బెళగల్‌, కర్నూలు మండలాల నుంచి పెద్దఎత్తున కార్యకర్తలు, నాయకులు కదలొచ్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో కూటమి నాయకులు ఎవరైన సరే కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడితే సహించేది లేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జీడీపీ నుంచి పైపులైను ద్వారా కోడుమూరుకు నీరు తీసుకు వచ్చేందుకు సుమారు రూ.39కోట్లు నిధులను మంజూరు చేసిందన్నారు. ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మాట్లాడుతూ నియోజకవర్గంలోని కూటమి నాయకులు స్థానిక సంస్థ ఎన్నికల్లో సమన్వయంతో పని చేసి ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచు స్థానాలను కైవసం చేసుకోవాలన్నారు. రెండేళ్లలో మహిళలకు ఉచిత బస్సు, తల్లికి వందనం, ఉచిత సిలిండర్లు, రైతులకు అన్నదాన సుఖీభవ, పేదలకు అన్నా క్యాంటీన్లు, వృద్ధులు, వితంతువులకు రూ.4వేలు, దివ్యాంగులకు రూ.6వేలు పింఛన్‌ అందిస్తున్న ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకే దక్కిందన్నారు. టీడీపీ నాయకులు రామక్రిష్ణారెడ్డి, రవీంద్రగౌడ్‌, గంగాధర్‌, బడెసాగౌడ్‌, అయ్యప్ప, మధు, ఎల్లప్ప బీజేపీ, జనసేన నాయకులు మహేష్‌ నాయుడు, వేల్పుల గోపాల్‌, రాంబాబు పాల్గొన్నారు.

Updated Date - Jun 20 , 2026 | 12:59 AM