ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి: డీఈవో
ABN , Publish Date - May 31 , 2026 | 12:33 AM
పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని జనార్దన్‌రెడ్డి కోరారు. పట్టణంలోని చంద్రబాబునగర్‌లో శనివారం బడి పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు.
బనగానపల్లె, మే 30 (ఆంధ్రజ్యోతి): పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని జనార్దన్‌రెడ్డి కోరారు. పట్టణంలోని చంద్రబాబునగర్‌లో శనివారం బడి పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందని చెప్పారు. ఎంఈవో స్వరూప మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల వారికి ఊరి బడి ఎంతో ఉపయోగ పడుతుందని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. యూటీఎఫ్ జిల్లా సహాధ్య క్షుడు సత్యప్రకాశ్, యూటీఎఫ్ మండల అధ్యక్షుడు ప్రతాప్, ఉపాధ్యా యులు అబ్దుల్‌ఖలీం, ప్రసన్నకుమార్, జగన్‌మోహన్‌రెడ్డి, సీఆర్‌పీలు నాగచంద్రుడు, సుఽధాకర్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.