హెల్త్ క్లినిక్ భవనాలకు రూ.50.40 కోట్లు
ABN , Publish Date - Jun 13 , 2026 | 12:03 AM
జిల్లాలో పీఎం అభి 15వ ఆర్థిక సంఘం కింద 120 హెల్త్‌క్లినిక్ భవనాలు చేపట్టడానికి రూ.50.40 కోట్లతో పనులు చేపట్టినట్లు పంచాయతీరాజ్ ఎస్‌ఈ నాగరాజు తెలిపారు.
చాగలమర్రి, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పీఎం అభి 15వ ఆర్థిక సంఘం కింద 120 హెల్త్‌క్లినిక్ భవనాలు చేపట్టడానికి రూ.50.40 కోట్లతో పనులు చేపట్టినట్లు పంచాయతీరాజ్ ఎస్‌ఈ నాగరాజు తెలిపారు. శుక్రవారం మండలంలోని డి. వనిపెంట, చిన్నవంగలి, పెద్దవంగలి, శెట్టివీడు, గొడిగనూరు గ్రామాల్లో జరుగుతున్న హెల్త్ క్లినిక్ భవన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 51 హెల్త్ క్లినిక్‌లకు రూ.21.42 కోట్లు, 15వ ఆర్థిక సంఘం కింద 69 హెల్త్ క్లినిక్‌లకు రూ.28.98 కోట్లు మంజూరయ్యాయని, వాటి ద్వారా జిల్లాలో పనులు చేపట్టామని అన్నారు. 70 గ్రామాలలో హెల్త్ క్లినిక్ భవనాల పనులు జరుగుతున్నాయని అన్నారు. కొన్ని గ్రామాల్లో స్థల సమస్య ఉండటం వల్ల పనులు జరుగలేదని అన్నారు. ఆయన వెంట పీఆర్ డీఈ వెంకట్‌రెడ్డి, పీఆర్ ఏఈలు ఉన్నారు.