రోడ్ల మరమ్మతులు చేపట్టాలి
ABN , Publish Date - Jan 29 , 2026 | 12:08 AM
పట్టణంలోని రోడ్ల మరమ్మతులు చేపట్టాలని, అలాగే అంబేడ్కర్ విగ్రహం నుంచి ఎద్దుల మార్కెట్ వరకు రోడ్లు వేయాలని ప్రగతిశీల యువజన సంఘం జిల్లా కార్యదర్శి చిన్నిప్రసాద్ డిమాండ్ చేశారు.
ఎమ్మిగనూరు టౌన్, జనవరి 28(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని రోడ్ల మరమ్మతులు చేపట్టాలని, అలాగే అంబేడ్కర్ విగ్రహం నుంచి ఎద్దుల మార్కెట్ వరకు రోడ్లు వేయాలని ప్రగతిశీల యువజన సంఘం జిల్లా కార్యదర్శి చిన్నిప్రసాద్ డిమాండ్ చేశారు. పట్టణంలోని ఎద్దుల మార్కెట్ రోడ్డులో బుధవారం ధర్నా చేపట్టారు. ఆయన మాట్లాడుతూ పట్టణంలో ప్రజా రవాణా అస్తవ్యస్తంగా మారిందన్నారు. అంబేడ్కర్ విగ్రహం నుంచి ఎద్దుల మార్కెట్ వెళ్లే, ఎద్దుల మార్కెట్ నుంచి మైనార్టీ కాలనీకి వెళ్లే, అలాగే గాంధీనగర్‌లోని రోడ్లు అధ్వానంగా ఉన్నాయన్నారు. గత వైసీపీ పాలనలో రోడ్లు మరమ్మతులకు నోచుకొలేదన్నారు. ఈ ఎద్దుల మార్కెట్ రోడ్డు ఆదివారం సంత సందర్భంగా సంతలోకి ఎద్దులతో వందల వాహనాలతో వస్తారని, పెద్ద మొత్తంలో జకాయతి వసూళ్లు చేస్తున్న మున్సిపల్ అధికారులు వారికి సౌకర్యాలు ఏర్పాటు చేయలేకపోతున్నారన్నాని అన్నారు. కార్యక్రమంలో లక్ష్మణ్, వెంకటేశులు, రాజన్న, తిప్పన్న తదితరులు పాల్గొన్నారు.