Share News

రోడ్ల నాణ్యత తనిఖీ

ABN , Publish Date - Jul 10 , 2026 | 12:56 AM

మండలంలోని సున్నిపెంట గ్రామంలో గత కొంత కాలంగా 10 కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణాలలో నాణ్యతా ప్రమాణాలను పరిశీలించేందుకు క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేసి పరీక్షలు నిర్వహించారు.

రోడ్ల నాణ్యత తనిఖీ
సున్నిపెంటలో సీసీ రోడ్డు నాణ్యతను పరీక్షిస్తున్న అధికారులు

శ్రీశైలం, జూలై 9 (ఆంధ్రజ్యోతి): మండలంలోని సున్నిపెంట గ్రామంలో గత కొంత కాలంగా 10 కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణాలలో నాణ్యతా ప్రమాణాలను పరిశీలించేందుకు క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేసి పరీక్షలు నిర్వహించారు. గురువారం క్వాలిటీ కంట్రోల్‌ కడప ఈఈ చేతన్‌ కుమార్‌ పర్యవేక్షణలో డీఈఈ సుధాకర్‌ రెడ్డి, ఏఈఈ సురేష్‌, ఏఈ రాముడు, పంచాయతీరాజ్‌ శాఖ డీఈ అయాజ్‌, స్థానిక సిబ్బంది మరియు కాంట్రాక్టర్ల సమక్షంలో రోడ్డు కొలతలు చేశారు. ప్రధానంగా బస్టాండ్‌ కేంద్రంగా చేసుకుని పూర్ణానంద ఆశ్రమం వరకు, అంబేద్కర్‌ విగ్రహం, రింగ్‌పార్క్‌, పోలీస్‌ స్టేషన్‌ రోడ్లను కొలుస్తూ వివిధ ప్రాంతాల్లొ కాంక్రీట్‌ శాంపిల్స్‌ను సేకరించుకున్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించడంలో వర్క్‌ ఆర్డర్‌ను పాటిస్తూ చేసిన పనులను పరిశీలించారు. రెండు రోజులపాటు క్వాలిటీ కంట్రోల్‌ తనిఖీలు, పరీక్షలు జరుగుతాయని డీఈ అయాజ్‌ తెలిపారు.

Updated Date - Jul 10 , 2026 | 12:56 AM