Share News

భద్రతా ఏర్పాట్ల పరిశీలన

ABN , Publish Date - Mar 12 , 2026 | 01:12 AM

పట్టణంలోని జూనియర్‌ సివిల్‌ జడ్జి, జుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ ఆఫ్‌ ఫస్ట్‌ క్లాస్‌ కోర్టులో భద్రతా ఏర్పాట్లను ఏఎస్పీ కృష్ణ మోహన్‌, డీఎస్పీ భార్గవి పరిశీలించారు.

భద్రతా ఏర్పాట్ల పరిశీలన
కోర్టు ఆవరణలో ఏఎస్పీ కృష్ణమోహన్‌, డీఎస్పీ భార్గవి

ఎమ్మిగనూరు టౌన్‌, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని జూనియర్‌ సివిల్‌ జడ్జి, జుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ ఆఫ్‌ ఫస్ట్‌ క్లాస్‌ కోర్టులో భద్రతా ఏర్పాట్లను ఏఎస్పీ కృష్ణ మోహన్‌, డీఎస్పీ భార్గవి పరిశీలించారు. బుధవారం కోర్టు సూపరింటెండెంట్‌ విష్ణుప్రియతో కలసి కోర్ట్టులోని రికార్డుల రూము, న్యాయాధికారి భద్రతలను పరిశీలించారు. ఈ మధ్య కాలంలో కోర్టులో జరుగుతున్న దాడుల దృష్టిలో ఉంచుకొని కోర్టు ప్రహరీ, లాయర్ల, సాక్షులపై జరుగుతున్న దాడుల దృష్ట్యా భద్రతా ఏర్పాట్లను పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. ఈ నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. సీఐ శ్రీనివాసులు, ఎస్సై మధుసూదన్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ డీఈ నాగరాజు, సూపర్‌వైజర్‌ ప్రభు, ఎలక్ర్టిక్‌ డీఈ నాగేంద్రప్రసాద్‌, ఏఈ ప్రసన్నరాజు, ఫైర్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2026 | 01:12 AM