Share News

ప్రజా సమస్యలు తక్షణమే పరిష్కరించండి

ABN , Publish Date - Jul 03 , 2026 | 11:53 PM

ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్‌ రెడ్డి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.

ప్రజా సమస్యలు తక్షణమే పరిష్కరించండి
అర్జీలు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే కోట్ల

  • గ్రీవెన్స్‌లో ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్‌ రెడ్డి

డోన్‌ టౌన్‌, జూలై 3 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్‌ రెడ్డి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు నీటి, రోడ్లు, పింఛన్లు, విద్యుత్‌, ఆరోగ్య సదుపాయాలు వంటి సమస్యలను అర్జీలు సమర్పించారని తెలిపారు. ఈ సమస్యలను సంబంధిత అధికారులు వీలైనంత తొందరగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికారులు ముందుండాలని, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చేలా పని చేయాలని సూచించారు. ప్రజలు గ్రామంలో ఏ సమస్య ఉన్న తమకు అర్జీలు అందజేసి పరిష్కరించుకోవాలన్నారు.

Updated Date - Jul 03 , 2026 | 11:53 PM