ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Jul 23 , 2026 | 12:37 AM
అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు.
నంద్యాల రూరల్, జూలై 22 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో బుధవారం నియోజకవర్గంలోని క్లస్టర్లు, యానిట్, బూత్‌స్థాయి నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజాభున్నతి కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి విస్తృతంగా ప్రచారం చేసి వాటి ద్వారా లబ్ధి పొందిన అంశాలను ప్రజలకు వివరించాలని సూచించారు. అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు గాడిలో పెట్టి అభివృద్దే లక్ష్యంగా ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. రాయలసీమను రతనాలసీమగా మార్చేందుకు రూ.12,484 కోట్లతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధితో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలో డ్రోన్ సిటీ, ఇండ్రస్ట్రియల్ హబ్, కడపలో రాయలసీమ స్టీల్ ప్లాంట్, అనంతపురంలో భారీ ఎనర్జీ ప్రాజెక్ట్‌లు, నంద్యాలలో సోలార్, విండ్ పరిశ్రమల ద్వారా యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. మెగా డీఎస్సీ ద్వారా 16 వేల ఉపాధ్యాయుల పోస్టులు, 6 వేల పోలీస్ ఉద్యోగాల భర్తీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాల పోస్టర్లను మంత్రి ఫరూక్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్, గోస్పాడు మండల కన్వీనర్ తులసీశ్వరరెడ్డి, సరగ, ఉప్పర కార్పొరేషన్ డైరెక్టర్లు సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.