Share News

విద్యుత్‌ అదాలత్‌తో సమస్యలు పరిష్కారం

ABN , Publish Date - Jun 06 , 2026 | 12:31 AM

విద్యుత్‌ అదాలత్‌ల ద్వారా వినియోగదారుల సమస్యలు పరిష్కరిస్తామని విద్యుత్‌ వినియోగ దారుల ప్రత్యేక అదాలత్‌ చైర్మన్‌, రిటైర్డ్‌ న్యాయాధికారి శ్రీనివాస ఆంజనేయయూర్తి అన్నారు.

విద్యుత్‌ అదాలత్‌తో సమస్యలు పరిష్కారం
మాట్లాడుతున్న శ్రీనివాస ఆంజనేయమూర్తి

ఓర్వకల్లు, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ అదాలత్‌ల ద్వారా వినియోగదారుల సమస్యలు పరిష్కరిస్తామని విద్యుత్‌ వినియోగ దారుల ప్రత్యేక అదాలత్‌ చైర్మన్‌, రిటైర్డ్‌ న్యాయాధికారి శ్రీనివాస ఆంజనేయయూర్తి అన్నారు. శుక్రవారం ఓర్వకల్లు విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌లో ఇన్‌చార్జి డీఈ రాజశేఖర్‌ ఆధ్వర్యంలో కర్నూలు డివిజన్‌ వారి ఆధ్వర్యంలో ప్రత్యేక విద్యుత్‌ అదాలత్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీనివాస ఆంజనేయమూర్తితో పాటు టెక్నికల్‌ మెంబర్‌ ఏ.శ్రీనివాసబాబు, ఇండిపెం డెంట్‌ మెంబర్‌ విజయలక్ష్మి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ విని యోగదారుల సమస్యల పరిష్కారానికే ప్రత్యేక విద్యుత్‌ అదాలత్‌ ఏర్పాటు చేశారన్నారు. వినియోగదారుల సమస్యలు ఏమైనా ఉంటే.. తమ దృష్టికి తీసుకువస్తే ప్రత్యేక విద్యుత్‌ అదాలత్‌ ద్వారా పరిష్కరిస్తామన్నారు. వినియోగదారులు విద్యుత్‌ సమస్యలను రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారని, వాటిని త్వరగా పరిష్కరిస్తామ న్నారు. ఏడీఏ సుబ్బన్న, ఏఈ సునీల్‌బాబు, లైన్‌మెన్‌ మహమ్మద్‌ షఫీ, కర్నూలు డివిజన్‌లోని ఏఈలు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 06 , 2026 | 12:31 AM