Share News

సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Feb 05 , 2026 | 11:42 PM

ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ల సమస్యలు పరిష్కరించాలని ఎంప్లాయీస్‌ యూనియన్‌ డిపో కార్యదర్శి ఉలిగప్ప కోరారు.

సమస్యలు పరిష్కరించాలి
ఆర్టీసీ డిపో ఎదుట ఆందోళన చేస్తున్న నాయకులు

ఆదోని అగ్రికల్చర్‌, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ల సమస్యలు పరిష్కరించాలని ఎంప్లాయీస్‌ యూనియన్‌ డిపో కార్యదర్శి ఉలిగప్ప కోరారు. ఆదోని ఆర్టీసీ డిపో ఎదుట ఏపీపీటీడీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ డిపో మేనేజర్‌ ఏకపక్ష నిర్ణయాలతో డ్రైవరు,్ల కండక్టర్లు, మెకానిక్‌లు ఉద్యోగాలు చేయలేని పరిస్థితి ఉందన్నారు. రెండేళ్లు పైబడిన ఇంతవరకు డ్రైవర,్ల కండక్టర్లకు సంబంధించిన డ్యూటీ చార్ట్‌ వేయలేదన్నారు. బస్సులకు కావాల్సిన పనిముట్లు కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. స్ర్తీ శక్తి ద్వారా ప్రయాణికుల రద్దీ పెరిగిందని, దీంతో బస్సులు మొరాయిస్తున్నాయని, వాటికి అవసరమైన పరికరాలను తెప్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు రంగస్వామి, సుధాకర్‌, చాంద్‌ బాషా, బీఎల్‌ రాజు, ప్రసాద్‌, గోవిందు పాల్గొన్నారు.

Updated Date - Feb 05 , 2026 | 11:42 PM